పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని,…
రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొదట తన తండ్రిని గొంతుకోసి చంపాడు. అనంతరం తన 5 ఏళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని పాలి ప్రాంతంలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి మొదట తన తండ్రిని గొంతు కోసి హత్య చేసి, ఐదేళ్ల కొడుకుతో కలిసి చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు.
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు, మిస్సింగ్స్ ఆగడం లేదు. చదువుల్లో ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి.. ఐదేళ్ల పాటు ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నానంటూ పేరెంట్స్కు మెసేజ్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు విద్యార్థి జాడ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.
పెళ్లి సమయంలో ఫన్నీ సన్నివేశాన్ని చిత్రీకరించడం కొత్తేమీ కాదు. అలాంటి దృశ్యాలు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతాయి. అలాంటి కదిలే సన్నివేశాలు కూడా మనల్ని నవ్వించడంలో సక్సెస్ అవుతాయి. సోషల్ మీడియాలో ఇలాంటి దృశ్యాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి మరో వీడియో యాడ్ అయింది. పెళ్లి సమయంలో వధూవరులు ఒకరికొకరు పూలమాల వేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వధూవరుల బంధువులు వారిని పట్టుకుని పూలదండలు వేస్తారు. చివర్లో, , అలాంటి కష్టంతో, వధూవరులకు…
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు.
కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో…
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో 20 నుంచి 30 కోట్ల రూపాయలు ప్రజలకు చేరాయన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి 626 ప్రత్యేక సర్వీసులు అందిస్తుంది. అంతేకాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బెంగళూరు నుంచి 200 ప్రత్యేక సర్వీసులు నడపనుంది. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల నుంచి రెగ్యులర్ సర్వీసులు ఫుల్ కాకపోవడంతో ప్రత్యేక సర్వీసులు లేవు. మరోవైపు.. 10వ తేదీ శుక్రవారం కావడం.. అలాగే శని, ఆది వారాలు సెలవులు ఉండటంతో అత్యధికంగా 199 సర్వీసులు హైదరాబాద్ నుంచి, 95 సర్వీసులు బెంగళూరు నుంచి రాష్ట్రంలోని…