Yahya Sinwar: గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు. ఇద్దరు అధికారులు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌తో మాట్లాడుతూ, హమాస్ నాయకుడు యాహ్వా సిన్వార్ రఫాకు ఉత్తరాన ఐదు మైళ్ల దూరంలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలో భూగర్భ సొరంగాల్లో దాక్కున్నాడని చెప్పారు. సిన్వార్ ఇంకా గాజాలోనే ఉన్నాడని ఇజ్రాయెల్‌కు చెందిన మరో అధికారి తెలిపారు. మార్చిలో యాహ్యా సిన్వార్ దగ్గరి బంధువులు రాఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌కు వెళ్లినట్లు తెలిసింది. అనేక ఇతర హమాస్ నాయకులు కూడా వారి బంధువులు, కుటుంబ సభ్యులను గాజా నుంచి ఈజిప్టులోని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు.
Read Also: Rahul Gandhi : చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్ పై రాహుల్ వ్యాఖ్యలు
అక్టోబరు 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌లో జరిగిన దాడిలో దాదాపు 1,200 మంది చనిపోయారు. 200 మందికి పైగా కిడ్నాప్‌కు గురయ్యారని.. ఈ దాడికి యాహ్యా సిన్వార్ సూత్రధారి అని ఇజ్రాయెల్ పేర్కొంది. తరువాతి నెలల్లో ఇజ్రాయెల్ ఇతర సీనియర్ కమాండర్లతో సహా హమాస్ మిలిటరీ వింగ్ డిప్యూటీ కమాండర్ మార్వాన్ ఇస్సాను చంపేసింది. అయినప్పటికీ యాహ్యా సిన్వార్, అతని డిప్యూటీ, మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దీఫ్ జాడ లేదు. ఇజ్రాయెల్ రఫాలో దాడిని ప్రారంభించింది. హమాస్ మిలిటెంట్ గ్రూపుకు రఫా ఆఖరి కోట అని ఇజ్రాయెల్ పేర్కొంది. శుక్రవారం, ఇజ్రాయెల్ ట్యాంకులు రాఫా తూర్పు, పశ్చిమ విభాగాలను విభజించే ప్రధాన రహదారిని స్వాధీనం చేసుకున్నాయి. ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్‌ను విభజించే 12 కి.మీ సరిహద్దులో రఫా ఉంది. గాజా నుంచి ప్రజలు బయటకు వెళ్లాలన్నా, బయట నుంచి వస్తువులు రావాలన్నా, మానవతా సహాయం అందాలన్నా ఈ ప్రాంతమే ఆధారం. అక్టోబర్ 2023లో ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 34,500 మందికి పైగా పెరిగింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Delhi Storm: ఢిల్లీలో దుమ్ము తుఫాన్.. నిలిచిన విమాన రాకపోకలు
ఆకస్మిక దాడులతో ఇజ్రాయిల్‌ను హమాస్‌ను దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే పాలస్తీనాకు చెందిన ఆ ఉగ్రవాద సంస్థకు యాహ్యా సిన్వార్ మూలస్తంభంగా ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తే లక్ష్యంగా ఇజ్రాయిల్ తన గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇజ్రాయిల్‌పై అటాక్‌కు ప్లాన్ వేసిన మాస్టర్‌మైండ్ ఆయనే అని ఇజ్రాయెల్ పేర్కొంది. సిన్వార్‌తో పాటు ఆయన బృందాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయిల్ ముందుకు వెళ్తోంది.