Crime News: దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట గ్యాంగ్ రేప్‌లు, చిన్నపిల్లలపై అత్యాచారాలు పేట్రేగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. కామాంధులు ఆగడం లేదు. అతి దారుణంగా ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా.. ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బరేలీలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.
Read Also: Uttarpradesh : మేనకోడలి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన అత్త
నేరం చేసిన తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి పడిపోవడంతో మైనర్ ఆరోగ్యం క్షీణించిందని.. నిందితులు బాలిక చేతులు, కాళ్లు కట్టి ట్రాలీ కింద పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీ కింద నుంచి చిన్నారిని రక్షించారు. మైనర్ స్పృహలోకి రావడానికి చాలా సమయం పట్టిందని, ఆమె తన కుటుంబ సభ్యులకు తన బాధను వివరించిందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఫిర్యాదు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.