ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు బస్సులు, ఫ్లైట్లు, రైళ్లలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండా వానను కూడా లెక్క చేయకుండా జనం ఓటేశారు. పలు చోట్ల హింసాత్మక దాడులకు కూడా భయపడకుండా ఏపీ ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును ఈవీఎం బాక్సులలో నిక్షిప్తం చేశారు.
అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు…
యూపీలో వైద్యుడి నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్ వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు. తాజాగా యూపీలో ఇలాంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో…
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి పై.. కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలువ బోతుందన్నారు. లక్షా 30 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి…
దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.…
పవన్ కల్యాణ్‌కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…
తెలంగాణలో నిన్న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసుందకు ముందుకు వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రెండు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ జరిగి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణలోని ఆ రెండు గ్రామాల ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం. ప్రధాని మోడీ నేడు యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాసేపు వర్షం ఆగినప్పటికీ.. తిరిగి మళ్లీ ప్రారంభంకావడంతో రద్దు అయింది. ఈ క్రమంలో.. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది.
ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ రోజు రాత్రి అక్కడే ఉండి.. రేపు ఉదయం ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.