KTR : మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. ‘మహబూబ్ నగర్ గడ్డపై ఎగిరిన గులాబీ జెండా.. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు.. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు..’ అని ఆయన ట్విట్ చేశారు.
అంతేకాకుండా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయమన్నారు. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది అని, ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిదన్నారు. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిదని, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గులాబీ పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు… శుభాకాంక్షలు… అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!