అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకే ప్రారంభమైన కౌంటింగ్.. ఇప్పటికే బీజేపీ సగం మార్కును దాటింది. ఈ క్రమంలో.. బీజేపీ సీఎం అభ్యర్థి పెమా ఖండూ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలోని 60 స్థానాల్లో 31 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. అధికార బీజేపీ ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలను ఏకపక్షంగా గెలుచుకుంది. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షపాతం హెచ్చరిక జారీ చేయడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందనుంది . హైదరాబాద్‌లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒకచోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.…
ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఉదయం ఆరు గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. కాగా.. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 స్థానాలుండగా.. ఇప్పటికే 10 చోట్ల బీజేపీ ఏకగ్రీవంగా గెలుపొందింది. మిగిలిన 50 స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం. నేటితో ముగియనున్న అరునాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు. అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ముందుగానే ఓట్ల లెక్కింపు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 స్థానాలు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న బీజేపీ. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.72,550 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.66,500 లుగా ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ.98,000 లుగా…
ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది. దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది. ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగిందని.. ప్రభావిత జనాభా సంఖ్య ఆరు లక్షలకు పైగా పెరిగిందని అధికారిక బులెటిన్ శనివారం తెలిపింది. శుక్రవారం నాటికి 11 జిల్లాల్లో బాధితుల సంఖ్య 3.5 లక్షలు అని పేర్కొంది. అయితే.. ప్రభావిత జిల్లాల సంఖ్య 10కి తగ్గిందని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసింది. మే 28 నుండి 15 వరకు…
కొద్దిరోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో యావత్ విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.