శనివారం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చివరి దశ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అందులో అన్నీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా వచ్చాయి. ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. వివిధ టీవీ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్‌లో సైతం బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో.. ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు.
Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ వైరల్!
ఇది ఎగ్జిట్ పోల్ కాదని, మోడీ మీడియా పోల్ అని రాహుల్ గాంధీ అన్నారు. ఇది వారి ఫాంటసీ పోల్ అని ఆరోపించారు. చాలా స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉందని, ఫలితాలు వచ్చాక అంతా తేలిపోతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్‌ను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ‘సిద్ధూ మూసేవాలా పాటను గుర్తు చేశారు. ఈ పాట మీరు విన్నట్లయితే అప్పుడు అర్థం చేసుకోండని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను ‘నకిలీ’గా పేర్కొంటూ.. ఇది ఎన్నికల రిగ్గింగ్‌ను సమర్థించే ‘ఉద్దేశపూర్వక ప్రయత్నమని’, భారత కూటమి కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ ఆడుతున్న ‘సైకలాజికల్ గేమ్’ అని కాంగ్రెస్ పేర్కొంది.
Suspecting Affair: అక్రమ సంబంధం ఉందని అనుమానం.. భార్యను గొంతుకోసి హత్య, ఆపై ఏం చేశాడంటే..?
‘కొత్త ప్రభుత్వం’ యొక్క 100 రోజుల ఎజెండాను సమీక్షించడానికి సుదీర్ఘ మేధోమథనంతో సహా అనేక సమావేశాలను నిర్వహించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ‘అధికార వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థకు సంకేతం’. అని అన్నారు. ఇవన్నీ మైండ్ గేమ్‌లని తెలిపారు. ఓట్ల లెక్కింపును నిష్పక్షపాతంగా నిర్వహించే బాధ్యతను అప్పగించిన సివిల్ సర్వెంట్లు ఈ ఒత్తిళ్ల వ్యూహాలకు బెదిరిపోరని ఆశిస్తున్నామని జయరాం పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా ఫేక్ అని, జూన్ 4న బీజేపీ వెళ్లిపోవడం ఖాయమని తెలిపారు.