నిజామాబాద్ జిల్లా కేంద్రం గౌతం నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయ్ అనే యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. నగరంలోని అమ్మ వెంచర్లో స్నేహితులతో కలిసి విజయ్ క్రికెట్ ఆడుతుండగా.. గుండెపోటు వచ్చింది. దీంతో గమనించిన తోటి స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించే లోపు యువకుడు విజయ్ మృతి చెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గత నెలలో పోలీసు అధికారి కారును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడిన వారిలో ఐదుగురు నక్సలైట్లు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండెం-కుప్రేల్ గ్రామాల నుంచి ఐదుగురు నక్సలైట్లను అరెస్టు చేయగా, మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన వారంతా హత్య, భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత వహించిన మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకుని విజయం సాధించిన బీజేపీ ఎంపీ డీకే అరుణతో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా గెలుపును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 సార్లు వచ్చి సభలో పెట్టిండని, వ్యక్తి గతంగా నన్ను రేవంత్ రెడ్డి దూషించాడని ఆమె మండిపడ్డారు.…
పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన పెంచుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని మహాత్మా జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జీవించడానికి మన పర్యావరణం చాలా ముఖ్యమైనదని అన్నారు. వాతావరణ అనుకూలంగా ఉండే విధంగా…
2024 ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా.. ఈ ఎన్నికల్లో కొందరు ముఖ్యమైన ఓటమిపాలైతే.. మరికొందరు తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టనున్నారు. కాగా.. నిన్న గెలిచిన వారిలో కాంగ్రెస్ ఎంపీగా సంజనా జాతవ్ కూడా ఉన్నారు. ఈమె ఇండియాలో అతిపిన్న వయస్సు గల ఎంపీ.. రాజస్థాన్‌లోని భరత్పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు…
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి భారీ విజయం సాధించింది. ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా.. టీడీపీ నేతలు విజయానందంలో మునిగితేలుతున్నారు. కాగా.. విజయంపై కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ పై నమ్మకంతో ప్రతిపక్షమే లేని మెజార్టీని ప్రజలు ఇచ్చారని తెలిపారు.
ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎమ్మె్ల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర నాయకులను కలిసి ముచ్చటించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. కామినేని శ్రీనివాస్‌ను రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ, జి. మధుకర్, వేటుకూరి సూర్యనారాయణ రాజు శాలువ కప్పి సత్కరించారు. ఈ క్రమంలో.. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలు ఇచ్చిన ప్రజావిజయం…
గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి తెలంగాణ హైకోర్ట్ మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనందున ఈ దశలో వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొచ్చింది.
ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథం వైపు సాగుదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ట్విటర్(ఎక్స్) ద్వారా అభినందనలు తెలియజేశారు.
ఏపీలో ఫలితాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. కూటమికి భారీ ఎత్తున సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చతికల పడింది. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజీనామా చేశారు.