జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు కలుపుతాయి. హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి టీజీఎస్ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్ స్టేషన్లు , విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. ప్రత్యేక బస్సులు కూడా ముఖ్యమైన ప్రదేశాల…
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి దగ్గరలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆగిపోవడంపై ఆ పార్టీ నేత, తెలంగాణ మంత్రి సీతక్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. మీడియా కళ్లకు గంతలు కట్టుకుందని, దేశంలో వాస్తవంగా జరుగుతున్నదేంటో నిజంగా చూపించి ఉంటే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి ఉండేదని అన్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఓ యోధుడని కొనియాడారు. అహంకారంతో వ్యవహరించే షెహన్షా(రాజు)ను మోకాళ్లపై కూర్చోబెట్టారని మోదీని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. తామంతా రాహుల్ వెంటే…
ఎన్నికలు ముగిశాయి.. అందరూ చాలా కష్టబడ్డారని.. మా ఓటమిని అంగీకరిస్తున్నామని తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని.. అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని కొనసాగించాలని మా అభిప్రాయాన్ని చెబుతున్నామన్నారు.
తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ…
జూన్ 8న మోడీ ప్రమాణస్వీకారం..‘8’వ తేదీనే ఎందుకు.? కారణం ఇదే.. ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఈ రికార్డును పునరావృతం చేస్తున్నది మోడీ మాత్రమే. ఈరోజు మోడీ నివాసంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జేడీయూ నేత నితీష్…
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.