అస్సాం జైలు నుంచి పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ ప్రారంభ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ 45,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పద్దెనిమిదవ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో 16 శాతం మంది జాతీయ పార్టీలు, ఆరు శాతం మంది రాష్ట్ర స్థాయి పార్టీలు, 47 శాతం మంది స్వతంత్ర అభ్యర్థులు. ఈ సమాచారం 'పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్' నివేదికలో ఇవ్వబడింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా విచారణ స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు సీజే ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సుమోటా పిటిషన్ గా హైకోర్టు స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఎస్ఐబి మాజీ హూ ఇస్ ది ప్రభాకర్ రావు,…
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు SBSP అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎన్డీయే మిత్రపక్షం ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌సభ స్థానంలో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సమర్ధిస్తూ.. జూన్ 8న ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ్‌భర్ తెలిపారు. మరోవైపు.. బీజేపీ గెలుపు ఖాయమని కూటమి నేతలు దుబాయ్,…
2019 అత్యాచారం, హత్య ఘటనలో నాగ్ పూర్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, IPC సెక్షన్ 376(A)(B), ఫొక్సో చట్టం కింద నిందితుడు సంజయ్ పూరి (32)కి జిల్లా జడ్జి, అదనపు సెషన్స్ జడ్జి SR పడ్వాల్ మరణశిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. 2019 డిసెంబర్ 6న లింగ గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. అయితే.. నిందితుడు అక్కడికి చేరుకుని అత్యాచారం చేసి హత్య…
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ క్రైస్తవుడిని కొట్టి చంపారు. దైవదూషణ ఆరోపణలపై గత వారం హింసాత్మక గుంపు క్రైస్తవ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రాడికల్ ఇస్లామిస్ట్ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు సర్గోధా జిల్లాలోని ముజాహిద్ కాలనీలో ఉండే.. క్రైస్తవ సంఘ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు క్రైస్తవులను, 10 మంది పోలీసులపై దాడి చేశారు. కాగా.. ఈ దాడిలో వారికి తీవ్ర…
నల్గొండ మున్సిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకర్లో మృతదేహం లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ‘నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండలో మరో ఘోరం’ అంటూ వచ్చిన కథనాన్ని రీట్వీట్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో ఓ మృతదేహం లభ్యమైంది. దాదాపు పదిరోజులుగా ప్రజలు అవే నీళ్లు తాగుతున్నారు. తాగునీటిలో తేడా కనిపించడంతో మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి…
ఫ్లైట్ డోర్ తెరిచేందుకు యత్నం.. కేరళ వ్యక్తి అరెస్ట్ ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే.. తాజాగా ఒక ప్యాసింజర్ ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి అరెస్ట్ పాలయ్యాడు. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కేరళలోని కోజికోడ్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ప్రయాణికుడు రచ్చ…
బెంగాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్హెచ్ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు…