Andhra Pradesh: రాష్ట్రంలో 40 మంది సలహాదారుల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.
Read Also: Perni Nani: హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారు..
Also Read
మరోవైపు మంత్రుల పేషీల్లోని సిబ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్‌లను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని.. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా అక్నాలెడ్జ్ చేసివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!