చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి మోది నీ గెలిపించారని ఎంపీ చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వేవ్ తోనే చేవెళ్లలో భారీ మెజారిటీ సాధించామన్నారు. షేర్ లింగంపల్లిలో అనుకొని రీతిలో మాకు ఓట్ల మెజారిటీ పెరిగిందని, ఈ సారి పోలీసులు కూడా భాగా పని చేశారు కాబట్టే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మెదక్ లో విజయం రఘునందన్ రావు ను అభినందిస్తున్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు సాధిస్తుందన్నారు కొండా. అందుకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేశామని, తెలంగాణ ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ అవసరం.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీచేందుకు నా వంతు కృషి చేస్తాను.. మైనారిటీల విషయంలో బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేశారు.. మేము జై భారత్ అంటాము..జై శ్రీరామ్ అంటాం.. కాంగ్రెస్ మతం పేరుతో బిజెపి నీ తప్పుగా చూపే ప్రయత్నం చేశారు..
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం బీజేపీది.. ఎప్పటి లాగే మోది ఆధ్వర్యంలో అభివృద్ధి కొనసాగుతుంది.. గతంలో ఎంపీ గా హైవేలకు , ప్రాజెక్ట్ లకు నిధులు తెచ్చాను.. అప్పుడు చేయలేకపోయినా పనులు కూడా ఇప్పుడు నిధులు తెచ్చి చేయిస్తా.. చేవెళ్ల ఎవరు కూడా రెండో సారి ఎంపీలు గా గెలువలేదు అంటారు.. కానీ నేను చేవెళ్ల నుండి రెండో సారి గెలిచాను.. నేను చేసిన క్రికెట్ టోర్నమెంట్ల తో నాకు క్యాంపెయిన్ చేయడం సులువు అయ్యింది.. బీఆర్‌ఎస్ ఓట్లు డైవర్ట్ అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఅర్ఎస్ ఓట్లే కాదు కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు పడ్డాయి.. కాబట్టే అంత మెజారీటీ సాధించాం.. మా మీద నమ్మకంతో నే ఆ ఓట్లు పడ్డాయి కానీ ఎవరో చెప్పారని కాదు..’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.