ఉత్తర ప్రదేశ్ అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మపై ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి ఇక్కడ ఆమె వెనుకంజలోనే కొనసాగారు. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓడించారు. దీంతో ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను అమేథీ నుంచి బరిలోకి దింపింది. ఇక అమేథీ నుంచి గెలుపు ఖాయమని మొదటి…
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానంలో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్ పటేల్‌పై 7 లక్షల ఓట్ల ఆధిక్యతతో అఖండ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం.. అమిత్ షాకు మొత్తం 10,109, 72 ఓట్లు రాగా, పటేల్‌కు 2,66,256 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి జయకేతనం ఎగురవేశారు. కేరళలోని తిరువనంతపురంలో తన సమీప బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడి నుంచి శశిథరూర్ గెలవడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ.. మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హింసాకాండతో చెలరేగిన మణిపూర్‌లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. బీజేపీ, ఎన్‌పీఎఫ్‌లు తమ స్థానాలను కోల్పోయేలా కనిపిస్తున్నాయి.
2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రాన్ని ఏలిన కె.చంద్రశేఖర్ రావు ఇంటి బాట పడుతున్నారు. అయితే.. భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదు. కనీసం ఆధిక్యం దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్కు చెందిన నేతలు రాకపోవడం గమనార్హం. తెలంగాణలో ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఒక్కొక్కటి ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన సీటు,…
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ గెలుపు దిశగా పయనిస్తుండగా.. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారాలోకేష్ ఘన విజయం సాధించారు.
2024 ఎన్నికల పోరులో కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంటోంది. గత 10 ఏళ్లలో పార్టీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి తొలి విజయం లభించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బీజేడీ ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.