Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్… అభ్యర్థులకు సూచనలు చేసిన టీఎస్‌పీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Prelims: ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనలు చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గ్రూప్ – I సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్ష సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల నుండి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. అభ్యర్థుల నిర్దిష్ట ఓఎంఆర్ షీట్లు, శిక్షణ పొందిన బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు,. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం పరీక్షను సజావుగా నిర్వహించడం కోసం చీఫ్ సూపరింటెండెంట్లందరితో సమర్థవంతమైన సమన్వయం కోసం ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక RC చొప్పున ప్రాంతీయ సమన్వయకర్తలు (RC) కమిషన్ నుండి నియమించబడ్డారు. మొత్తం 897 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ల నియామక ఉత్తర్వులను కమిషన్ జారీ చేసింది.
Read Also: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్, పరీక్ష జరుగుతున్నప్పుడు 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసే ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాల వారీగా హెల్ప్ డెస్క్ నంబర్‌లు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవేశ ద్వారాల వద్ద మాత్రమే కాకుండా ప్రతి పరీక్ష కేంద్రం కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ అధికారులను అభ్యర్థించడం జరిగింది. పరీక్షా కేంద్రాలు ఉన్న రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని TGSRTCని కోరారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో రెవెన్యూ శాఖ 144 సెక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10:00 గంటలకు గేట్లు క్లోజ్ చేయనున్నారు. పరీక్షా కేంద్రం యొక్క గేట్లు మూసివేసిన తరువాత అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు A4 పరిమాణ కాగితంపై ముద్రించిన హాల్ టికెట్‌ను లేజర్ ప్రింటర్‌తో తీసుకురావాలని సూచించారు. కలర్ ప్రింట్ తీసుకుంటే మంచిదని అధికారులు తెలిపారు. పరీక్షకు రాకముందు ప్రింటెడ్ హాల్ టికెట్‌లో అందించిన స్థలంలో (3) మూడు నెలలకు ముందు తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!