Andhra Pradesh: ఏపీలో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది. వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని.. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
గురువారం రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. మరోవైపు మంత్రుల పేషీల్లోని సిబ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్‌లను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని.. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా అక్నాలెడ్జ్ చేసివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!