అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం, శనివారం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరుగుతోందని, 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతోంద ఆయన వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొట్టమొదటి సారిగా భారతదేశంలో మన హైదరాబాదులో ఈ సమ్మిట్ నిర్వహించటానికి నిర్ణయించుకున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని, వివిధ దేశాల వరి…
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం అయిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన మొత్తం 2,600 మంది కుక్‌లు, వాటర్ క్యారియర్లకు పదోన్నతి లభించింది. 1939లో ఏర్పాటైన 85 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సీఆర్పీఎఫ్ క్యాటరింగ్లో రెండు ప్రత్యేక కేటగిరీలకు చెందిన మొత్తం 12,250 మంది సిబ్బందిని కలిగి ఉన్నారు. వీరు దళంలోని సుమారు 3.25 లక్షల మంది పురుషులు, మహిళా సిబ్బంది కోసం.. వంటశాలలు, క్యాంటీన్లు, ఇతర పరిపాలనా విధులను…
రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించింది. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు ఎక్కువ వచ్చాయని, బీఆర్ఎస్.. బీజేపీ అధర్మ యుద్ధానికి తెర లేపినా మా బలం పెరిగిందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ సీటు కూడా గెలిచామని, ప్రజల కోసం పని చేస్తోంది ప్రభుత్వమన్నారు. బీజేపీ నేతలు నోరుంది కదా అని నోరు పారేసుకోవద్దని, బీజేపీ ది బలుపు కాదు వాపు అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైనా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతుందని,…
కేంద్రమంత్రి రేసులో ఉన్నారా అని ప్రశ్నపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రధానమంత్రి ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని తెలిపారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తాని ఆయన తెలిపారు. నేను ఎప్పుడూ రేసులో ఉండను.. ఎవరికీ ఎం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వచ్చాయన్న వ్యాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్.. రేవంత్ వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, కాంగ్రెస్‌కి చావు తప్పి…
ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ…