MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. కాగా సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు.. కవిత చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తిని రౌస్ రెవిన్యూ కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణను జూన్ 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
Read Also: Delhi: ఎల్‌కే.అద్వానీ, జోషిలతో ప్రధాని మోడీ భేటీ.. ప్రమాణస్వీకారానికి ఆహ్వానం