హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా.. 40 మంది పిల్లలకు గాయాలు హర్యానాలోని పంచకులలో స్కూల్ బస్సు బోల్తా పడటంతో పెను ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. హైస్పీడ్ స్కూల్ బస్సు రోడ్డుపై బోల్తా పడింది. అందులో సుమారు 40 మంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. వీరిలో చాలా మంది చిన్నారులకు గాయాలయ్యాయి. పంచకులలోని పింజోర్ సమీపంలోని నౌలత గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. విచారణ అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హర్యానా రోడ్‌వేస్‌కు చెందిన…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు,…
పార్వతీపుతం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం కలుగుతోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తరగతులు జరగకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామంలో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. జిపిఎస్ స్కూల్ వెంటనే తెరవాలని ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆదివాసి గిరిజన సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవడం రాష్ట్ర…
నార్త్ కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవులలో ఈ డ్రిల్స్ చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. దీనిపై నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తాజాగా రియాక్ట్ అయ్యింది. బార్డర్లో సైనిక విన్యాసాలు చేపట్టడం.. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైయస్ అంటే.. పోత పోసిన ధైర్యం.. వైయస్ అంటే.. మూర్తీభవించిన ప్రజాహితం.. వైయస్ అంటే.. నా అనుకున్న వాళ్లను అక్కున చేర్చుకునే ఔదార్యం.. వైయస్ అంటే.. రెండక్షరాల పేరు మాత్రమే కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు. నేడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే.. వైఎస్సార్‌గా పేరుగాంచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూడో తరం…
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యక్రమాలు ఉండటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పవిత్ర సంగమం వద్ద జల హారతి కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవనున్న నేపద్యంలో స్వాగతం పలకడానికి రింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులర్పించేందుకు రింగ్ సెంటర్ లోని గాంధీ…
నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు చేరుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ,…
హన్మకొండ జిల్లా దొడ్డి కొమురయ్య వర్ధంతి, రణధీర సీతక్క పుస్తక ఆవిష్కరణ పరిచయ వేదిక హన్మకొండ జెడ్పి కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతాను అనుకోలేదన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానని, విప్లవ ఉద్యమం నుంచి ప్రజా సేవకొచ్చానన్నారు. పేదలను అసహ్యహించుకునే వాళ్లు రాజకీయలలో ఎక్కువ ఉంటారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన జరిగితేనే…