Vasamshetti Subash : ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ఎన్టిటిపిఎస్ లో జరిగిన దుర్ఘటనపై సమగ్ర విచారణ చేస్తామని బాధితులకు అండగా ఉంటామన్నారు.
Also Read
గత ఐదేళ్లలో జరిగిన దురాగతలు, హడావుడిగా ఎన్నికల ముందు ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణమన్నారు. నట్టు బోల్టు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు బూడిద దోచుకొని ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నంగా మార్చారని ఆయన విమర్శించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏగా చెప్పుకొని థర్మల్ పవర్ స్టేషన్ల పని చేసేది సీఈ స్థాయి అధికారులను శాసిస్తున్నాడని, క్వాలిటీ బూడిదను లోపల రాల్చుకొని సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకున్నారన్నారు. బూడిద చెరువులో బూడిద అమ్ముకొని కోట్లు దండుకున్నారని మంత్రి సుభాష్ అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!