ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వేలైన్లపై చర్చ జరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకమని,…
ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని,…
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన…
ఉచిత ఇసుకపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక అమ్మకంప్రారంభం అవుతుందని.. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు. 3 నెలల్లో కోటి టన్నుల ఇసుకను అందించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ కార్పోరేట్ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకు ఈ-సిగరేట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాతబస్తీలో యువకుడిని అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. కాలాపత్తర్‌లో మైనర్ విద్యార్థులకు ఈ-సిగరెట్లు, వ్యాప్‌లు విక్రయిస్తున్న వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. ఖాజా నగర్‌లోని ఆయన నివాసంలో రూ.8 లక్షల విలువైన ఈ-సిగరెట్లు, వ్యాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహ్మద్ జాఫర్ (25) రాపిడోలో రైడర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఈ-సిగరెట్ల సరఫరాదారు అహ్మద్‌తో పరిచయం ఏర్పడి,…
నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలో గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ, పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహింగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు. అరకొర…
మహిళ ప్రజాప్రతినిధులందరికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. నా చిన్నప్పటి నుండి నేను మంత్రులు ఎమ్మెల్యేల క్వాటర్స్ లో ఉండి పెరిగాను, ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయని, టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చడం పట్ల నా తప్పు కూడా ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ…
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు.
జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో జగన్నాధ రథయాత్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు రథయాత్ర కొనసాగనుంది. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్నాధ రథయాత్ర నిర్వహణలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం…