లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు (Mercedes-Benz EQA) మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్లలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షా ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టింది.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా ప్రజలు సీఎన్జీ (CNG) కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కార్లు డబ్బులు ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే.. మీరు రూ.10 లక్షల లోపు సీఎన్జీ కారును కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే.. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో కార్లు ఉన్నాయి.
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పనలకు ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమావేశం నిర్వహించారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల పూర్వ వైభవానికి సామాజిక బాధ్యతగా ఫార్మా కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధులను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్లా గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపారు.
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు.