రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రష్యా వెళ్లారు. ఈరోజు మాస్కోలో ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కానున్న ప్రధాని, ఆయనతో పలు అంశాలపై చర్చించనున్నారు. దాదాపు ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.
ఓ యువకుడు సెల్ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మేస్త్రం కృష్ణ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఘోర బీఎండబ్ల్యూ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ ఘటనలు పెరిగిపోవడం పట్ల సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ నేరస్థులను సహించేది లేదని అన్నారు.
తాను మంత్రి పదవి ఆశిస్తున్నానని.. తన అభిప్రాయాన్ని సీఎంకు చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెల్లడించారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో చిట్చాట్లో పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
సోషల్ మీడియాలో ఓ చిన్నారి పై కొందరు యవకులు జుగుప్సాకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఘటనపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసారు.
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం తెల్లవారుజామున ముంబై.. శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలపై భారీగా నీరు నిలిచింది. భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ వర్షం దృష్ట్యా కొన్ని రైలు సర్వీసులను రద్దు చేయగా, ముంబై విమానాశ్రయంలో 27 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. నగరంలో తెల్లవారుజామున 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు శాఖ అధికారులు తెలిపారు.
గతంలో ఆంధ్ర.. తెలంగాణ ముఖ్యమంత్రులు ప్యాలెస్.. ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారని, కానీ చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సోమిరెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని ఆ రంగానికి…
ఏపీ ఎన్నికల తరువాత తొలిసారి ఏపీ బీజేపీ విసృతస్థాయి సమవేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదని, సమావేశం కన్నుల పండువగా ఉందన్నారు. రెండు వేల మంది పాల్గొనడం ఆనందదాయకమని, దేశం లో 140కోట్ల జనభా తో ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు…