రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో.. రేపట్నుంచి తెలంగాణలో రైతు భరోసా సదస్సులు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రేపటి నుంచి 22 వరకు వర్క్ షాప్ జరుగనుంది. ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ.. అభిప్రాయాలు సేకరించారు. రేపు ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైతు భరోసా సదస్సులో ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు. రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు, ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు. రైతు సదస్సులు పూర్తి అయ్యాక అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధివిధానాలను రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించనుంది.
Madhya Pradesh: “నలుపు”గా ఉన్నాడని భర్తను, పసిబిడ్డని విడిచి వెళ్లిన భార్య..
అలాగే..10వ తేదీన ఖమ్మం, 11 ఆదిలాబాద్, 12 మహబూబ్ నగర్, 15 వరంగల్, 16 మెదక్, 18 నిజామాబాద్, 19 కరీంనగర్, 22 నల్గొండ, 23 రంగారెడ్డి జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రైతు భరోసాపై మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప సంఘం చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు, ఇంఛార్జి మంత్రులు కూడా పాల్గొంటారు.