టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
Read Also: MP Shocker: నర్సుపై సహోద్యోగి అత్యాచారం.. బెదిరిస్తూ రెండేళ్లుగా అఘాయిత్యం..
ఈ సందర్భంగా.. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Read Also: Bandi Sanjay: ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తా..
ఇటీవల టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో సిరాజ్ ఉన్నారు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత.. ఈనెల 5వ తేదీన సిరాజ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. అనంతరం.. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్‌టాప్ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్ పెంచారు.