చివరి టీ20లో భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈరోజు (మంగళవారం) దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
Read Also: Urvashi Rautela: బాలయ్య సినిమా షూటింగ్‌లో ఊర్వశి రౌతేలాకి తీవ్ర గాయాలు?
మొదటగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో కేవలం 84 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. సౌతాఫ్రికా బ్యాటింగ్ లో తజ్మిన్ బ్రెట్స్ ఒక్క ప్లేయర్ మాత్రమే అత్యధికంగా 20 పరుగులు చేసింది. ఆ తర్వాత.. అన్నేకే బోష్ (17), మారిజానే కాప్ (10), లారా వోల్వార్డ్ట్ (9) పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీసింది. ఆ తర్వాత.. రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టింది. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ సంపాదించారు.
Read Also: Pa Ranjith: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై డైరెక్టర్ పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు.. డీఎంకేపై తీవ్ర విమర్శలు..
85 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు.. ఒక్క వికెట్ పడకుండా ఓపెనర్లు దంచేశారు. స్మృతి మంధాన అర్ధ సెంచరీతో చెలరేగింది. 40 బంతుల్లో 54 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. షఫాలీ వర్మ 27 పరుగులు చేసింది. కేవలం 10.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేశారు. ఇదెలా ఉంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఓడించింది. అంతేకాకుండా.. ఏకైక టెస్టులో కూడా విజయ పతాకాన్ని ఎగురవేసింది.