ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కన్నెర్ర చేసి కేసీఆర్ ఓడిపోతేనే తమకు ఉద్యోగాలు వస్తాయని.. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేతలకు పొంతన లేకుండా పోయిందని ఆరోపించారు.
ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీ ఎక్కడ? ముఖ్యమంత్రి గారు అని ప్రశ్నించారు. తొలి క్యాబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది? అని అన్నారు. తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా? చురకలు అంటించారు.
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిరాజ్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు చేరుకున్న సిరాజ్.. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్…
MP Shocker: మధ్యప్రదేశ్ గ్వాలియర్లో దారుణం జరిగింది. 28 ఏళ్ల నర్సుపై సహోద్యోగి గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. గ్వాలియర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బాధిత మహిళ దుస్తులు మార్చుకునే గదిలో నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కమ్యూనిటీ కళ్యాణ మండపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కసితో ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని…
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించండి.. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని కోరారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు.
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రూరల్ ఈరోజు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘాట్స్ పరిశీలన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పుష్కర సన్నాహాలు ప్రారంభమయ్యాయని, గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి…
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఎన్టీటీపీఎస్ ప్రమాదంలో గాయపడి గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదం గురించి మంత్రి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమ అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ఎన్టిటిపిఎస్ లో…