పల్నాడును డయేరియా వణికిస్తోంది. గడిచిన 15 రోజులుగా డయేరియాతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతి చెందారు. డయేరియా కారణాలతో నలుగురు , ఇతర అనారోగ్య కారణాలతో, ముగ్గురు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పిడుగురాళ్ల , మారుతి నగర్ , లెనిన్ నగర్ ప్రాంతాల్లో డయేరియా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడులో గడిచిన రెండు వారాలుగా డయేరియా ప్రభావంతో 160 మంది కి పైగా ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. 100 మందికి పైగా ప్రజలకు ట్రీట్మెంట్ చేసి ఇళ్లకు పంపించారు వైద్య సిబ్బంది.. మరో 50 మందికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, ప్రభుత్వ హాస్పిటల్ కు వైద్య చికిత్స కోసం తరలించారు అధికారులు. స్థానికంగా పరిశుభ్రత లేకపోవడం , జంతు వదలు ఎక్కువ అవ్వటం తో డయేరియా ప్రబలినట్లు వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ అరుణ్ స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు.
స్థానిక అపరిశుభ్ర పరిస్థితులను చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. డయేరియాను అరికట్టడానికి రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్యశాఖ లతో కూడిన బృందాన్ని పిడుగురాళ్లలో నియమించింది జిల్లా యంత్రాంగం.. డయేరియా ,మృతుల పేర్లు..( ఆంజనేయులు, తిరుపతమ్మ , బోడయ్య, సాత్విక్) వెల్లడించారు అధికారులు. డయేరియా లక్షణాలతో చనిపోయారని చెబుతున్నారు వైద్య సిబ్బంది. మరో ముగ్గురు ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని అధికారులు అంటున్నారు.