Crime News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కేకే ఫామ్‌హౌస్‌లో కమ్మరి కృష్ణను కొందరు దుండగులు దారుణంగా హత్యకు చేశారు. ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చిన కృష్ణపై ఒక్కసారిగా దాడి చేశారు. రియల్టర్ కృష్ణను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, కన్వెన్షన సెంటర్లు ఫామ్‌హౌస్‌లను కమ్మరి కృష్ణ నిర్వహిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ దారుణ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నేపథ్యంలోనేనా.. లేక మరే ఇతర కారణాల వల్ల హత్య చేశారా అనే తేలాల్సి ఉంది.
Read Also: Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య