Cabinet Sub-Committee: ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన..
- నేడు ఆదిలాబాద్ జిల్లాలో క్యాబినెట్ సబ్ కమిటీ పర్యటన..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు జిల్లాలో రానున్న కమిటీలోని మంత్రులు..
- ఉట్నూర్ కె బీ కాంప్లెక్స్ లో రైతు భరోసా పై వర్క్ షాప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub-Committee: రైతుభరోసా పథకం అమలుపై అనేక ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు సాగుతున్న వేళ నేరుగా రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల సమక్షంలోనే పథకానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పన కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ఇవ్వాళ ఆదిలాబాద్ లో కేబినెట్ సబ్మి కమిటీ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు జిల్లాలో కమిటీలోని మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు,సీతక్క పర్యటించనున్నారు. ఉట్నూర్ కె.బీ. కాంప్లెక్స్ లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 10.20 గంటలకు ఉట్నూర్ కు మంత్రుల బృందం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద నుంచి 10.30 గంటలకు మీటింగ్ హాల్ లో వర్క్ షాప్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహిస్తారు. రైతు భరోసా పై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు ఉపసంఘం తీసుకోనున్నారు.
Read also: Astrology: జులై 11, గురువారం దినఫలాలు
Also Read
మధ్యాహ్న భోజనం తరువాత 3.30 గంటలకు హైదారాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, మీటింగ్ హాల్‌లను స్థానిక శాసన సభ్యులు వెడ్మా బొజ్జుతో కలసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకంపై అభిప్రాయాల సేకరణకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయిలో వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు వర్క్ షాప్‌లో పాల్గొనడం జరుగుతుందని, రైతు భరోసా పథకంపై అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తారని పేర్కొన్నారు. శాసన సభ్యులు వెడ్మా బొజ్జు మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద రైతులతో సమావేశం కానున్న మంత్రివర్గ ఉపసంఘం రానున్నందున అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Off The Record: కాంగ్రెస్‌లో పాత వర్సెస్ కొత్త వార్..! వివాదాస్పద రాజకీయాలకు కేరాఫ్ ధర్మపురి..
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!