Crazy Offer : మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు… ఆన్‌లైన్ మోసం రోజు రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. దుండగులు సాధ్యమైనన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేస్తే రూ.10వేలు ఇస్తామంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఇంకేముంది కొందరు అద్భుతమైన ఆఫర్ అంటూ ఎగబడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రూ.750 ఫీజుతో మొదలయ్యే దోపిడి.. వేలు.. లక్షల్లో దండుకునే వరకు వెళ్లింది. ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ ఘటన హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలోని మేవాత్‌లో వెలుగులోకి వచ్చింది. మహిళలను ప్రెగ్నెంట్ చేస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేసే ముఠాగుట్టు రట్టు చేశారు సైబర్ క్రైం పోలీసులు. ఈ ముఠాలోని ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు.
Read Also:Sri vishnu : శ్రీ విష్ణుది చూసి ఆశ్చర్యపోతున్న సినీ వర్గలు…ఇంతకీ ఏమిటది…?
హర్యానాలోని మేవాత్‌లో దుండగులు KYC, OLX, Tatlu లాంటి దోపిడి తరహాలో విభిన్నమైన ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి.. పోలీసులుకు ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదును అందుకున్న నూహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులే అవాక్కయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు వివిధ రకాల ఉద్యోగాల కోసం చాలా ప్రకటనలను చూశాం. కానీ.. మొదటి సారిగా, షాకయ్యే ఉద్యోగ ప్రకటనను ఇప్పుడే చూశాం. అసలే మోసగాళ్లు పెళ్లయి చాలా కాలమైనా సంతానం కలగని ఇలాంటి మహిళలను ప్రెగ్నెంట్ చేసేందుకు ఈ ప్రకటన చేశారు. అందమైన మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోసగాళ్లు వారిని గర్భవతిని చేసిన వ్యక్తికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారంటూ పోలీసులు తెలిపారు.
Read Also:Uttarpradesh : యూపీ ఫలితాలతో తీవ్ర నిరాశలో యోగి.. భవిష్యత్ కోసం వరుస సమావేశాలు
ఇందుకోసం యువత సులువుగా ప్రభావితమై ఉచ్చులో చిక్కుకునేలా మోసగాళ్లు షరతు పెట్టారు. ఈ ప్రకటన చూసి అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు రూ.750 డిమాండ్ చేసేవారు. రిజిస్ట్రేషన్ సాకు చూపి మోసగాళ్లు యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించిన నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసింది. ఈ నిందితులను పాల్వాల్‌లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురాకా నివాసి ఇజాజ్, నుహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగుకు పైగా ఫేస్‌బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో ఇలాంటి మోసం జరగడం ఇదే మొదటిది.