Telangana DSC: తెలంగాణలో డీఎస్సీ రాసే అభ్యర్థులకు అలర్ట్. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ.. నేడు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సీబీటీ ఆధారిత పరీక్షను ఈ నెల 18 నుంచి నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షలు సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
Read Also: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
ఇదీ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్
* మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష జూలై 18న
* జూలై 18న రెండవ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష
* జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 20న SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
* జూలై 22 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
* జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 24న స్కూల్ అసిస్టెంట్- బయోలాజికల్ సైన్స్ పరీక్ష
* జూలై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
* జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
మరోవైపు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖను సీజ్ చేసి మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. అయితే షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేటి నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. డీఎస్సీని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అన్నారు. కోచింగ్ సెంటర్ల యజమానులు తమ వ్యాపారం కోసం పరీక్షలను వాయిదా వేయాలని తనను సంప్రదించారని తెలిపారు. విద్యార్థుల మృతితో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.