రెడ్ మీ (Redmi) తన కస్టమర్ల కోసం కొత్త ఇయర్ బడ్స్ని పరిచయం చేసింది. రెడ్ మీ బడ్స్ 5C.. వైర్‌లెస్ ఆడియో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరుస్తుంది. ఈ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) అనేక ప్రత్యేక ఫీచర్లతో ముందుకు వస్తుంది. అంతేకాకుండా.. ధర కూడా తక్కువే ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది మొత్తం 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. అంతేకాకుండా.. 40dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉంది.
Redmi Buds 5C ధర
ఈ ఇయర్ బడ్స్ ధర విషయానికొస్తే.. రూ. 1,999 ఉంది. కంపెనీ ఈ బడ్స్ ని మూడు కలర్లలో ప్రవేశపెట్టింది.. అకౌస్టిక్ బ్లాక్, బాస్ వైట్, సింఫనీ బ్లూ. రెడ్ మీ బడ్స్ 5C జూలై 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ పరికరాన్ని షియోమీ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
Redmi Buds 5C ఫీచర్లు
ఫీచర్ల విషయానికొస్తే.., రెడ్ మీ బడ్స్ 5C 40dB వరకు హైబ్రిడ్ ANC ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది SBC, AAC కోడెక్‌లకు మద్దతు ఇస్తుంది. అంతే కాకుండా.. షియోమి ఇయర్‌బడ్స్ యాప్ ద్వారా టోగుల్ చేయగల ప్రత్యేక పారదర్శకత మోడ్ ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు 12.4mm డైనమిక్ టైటానియం డ్రైవర్‌లను కలిగి ఉన్నాయి.. 5 సౌండ్ ప్రొఫైల్‌లను కూడా సపోర్ట్ చేస్తాయి. రెడ్ మీ బడ్స్ 5Cలో వినియోగదారు IP54 రేటింగ్‌ను పొందుతారు. ఇక కనెక్టివిటీ గురించి మాట్లాడినట్లయితే.. ఇది బ్లూటూత్ 5.3, Google ఫీస్ట్ పెయిర్ ఫీచర్‌ను కలిగి ఉంది. వినియోగదారులు ఎంచుకున్న షియోమీ, రెడ్మీ ఫోన్‌లలో ఆడియో షేరింగ్ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు. షేర్డ్ మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం రెండు రెడ్ మీ బడ్స్ 5Cని కనెక్ట్ చేయవచ్చు. బ్యాటరీ ఫీచర్ గురించి మాట్లాడితే.. ఈ బడ్స్ ఒక ఛార్జ్‌పై మొత్తం 7 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని, కేస్‌తో 36 గంటల వరకు పొందవచ్చు.