Lavanya Parents Interview: టాలీవుడ్ యాక్టర్ రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే లావణ్య తల్లిదండ్రులు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించలేదు. తాజాగా మీడియా ముందుకు వచ్చి చెప్పుకోలేని సంఘటనలు జరిగాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్‌తరుణ్‌కు లావణ్య ఎన్నో డబ్బులు ఇచ్చి ఆదుకుందని ఆమె తండ్రి చెప్పారు. రాజ్‌తరుణ్ గత పదేళ్లుగా తెలుసని తెలిపారు. తమ కూతురు చెప్పిందని అతడిని తాము నమ్మినట్లు, ఇప్పడు వారిద్దరి కలపాలని చూస్తున్నట్లు లావణ్య తల్లిదండ్రులు చెప్పారు. తమ కూతురికి అన్యాయం జరగిందని.. వారిద్దరిని ఒక్కటి చేయాలనే ఉద్దేశం తప్ప మరొకటి లేదన్నారు. గతంలో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండేవాళ్లమని, ఇప్పుడు ఫోన్ చేసినా కలవడం లేదన్నారు. అప్పుడు వాళ్లింటికి కూడా వచ్చి వెళ్లేవాళ్లమని.. ఇప్పుడు ఫోన్ కూడా లేదన్నారు. గత మూడు నెలల నుంచి రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు, మాకు ఎలాంటి మాటలు లేవని లావణ్య తండ్రి చెప్పుకొచ్చారు.
Read Also: Rajtarun-lavanya Love Fight: సినిమా రేంజ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చిన లావణ్య
లావణ్యకు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదని.. అదంతా అబద్ధమని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. చాక్లెట్ కూడా సరిగా తినలేని అమ్మాయిని.. డ్రగ్స్ తీసుకుంటుందని అబద్ధం చెప్పారని కొట్టిపడేశారు. ఇలాంటి వార్తలను పుట్టించిన మూర్ఖుడిని తన ముందు ఉంటే కొట్టాలనేంతగా బాధగా ఉంది కానీ.. వారిద్దరు ఒక్కటైతే చాలన్నారు. లావణ్యతో కలిసి జీవించాలనుకుంటే సహకరిస్తామని వారు చెప్పుకొచ్చారు. లావణ్యకు బెదిరింపులు కూడా వస్తున్నాయని తెలిసిందని, తనకు ఏమైనా జరిగితే ఊరుకోమన్నారు. ఆమెకు న్యాయం జరగాలని లావణ్య తల్లిదండ్రులు కోరుకున్నారు. రాజ్‌తరుణ్ నటుడు కాక ముందు నుంచే తనతో రిలేషన్ షిప్‌లో ఉన్నానని.. ఇప్పుడు సాధారణ యువతిగా తనకు న్యాయం కావాలని లావణ్య కోరుతున్నారు. రాజ్‌తరుణ్ ఇక తనకు దక్కడనే పరిస్థితి వస్తే చట్టపరంగా వెళ్తానని లావణ్య వెల్లడించారు.