భారత్ జింబాబ్వే మధ్య ఈరోజు నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్ ముందు 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
హైదరాబాద్ జేఎన్టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యపై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్-2024 లోగోను సీఎం విడుదల చేశారు.
గ్రూప్-1పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. టీజీఎస్పీఎస్సీ పారిదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే 1:50 రేషియోలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు కొందరు 1:100 పిలవాలని కోరుతున్నారు.. తమకేం ఇబ్బంది లేదు పిలవడానికి.. కానీ కోర్టుల్లో ఇబ్బంది ఎదురవుతుందనిన సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1 వ్యవహారం మళ్ళీ మొదటికి వస్తుంది.. నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే…
ఇండియా-జింబాబ్వే మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. అందులో భాగంగా ఈరోజు నాల్గవ టీ20 మ్యాచ్ ఉండనుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. తుషార్ దేశ్‌పాండే టీ20 అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తున్నాడు.
1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టుకు చారిత్రాత్మకమైనది. కపిల్ దేవ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 39 ఏళ్ల క్రితం భారత ఆటగాళ్లు ప్రపంచకప్ గెలిచినప్పుడు వారి జీతాలు చాలా తక్కువగా ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1983 నాటి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జీతం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ పాఠశాలల్లో ప్రహరీ కమిటీలు వేయనున్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ కమిటీలు పనిచేయనున్నాయి. అన్ని ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుండి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్ లు నిర్మించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టెంపుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. సోమాజిగూడలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఈటల ఆరోపించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారని పేర్కొన్నారు.
పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీ కార్యాలయం వేదికగా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి రోజూ ఒకరిద్దరు మంత్రులు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్న టీడీపీ అధినేత సూచించారు. కార్యకర్తలు.. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు అన్నారు. పార్టీకి ప్రభుత్వానికి గ్యాప్ రాకుండా చూసుకునే బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత దూషణలకు.. భౌతిక దాడులకు దిగకుండా సంయమనం పాటించాలన్న టీడీపీ అధినేత… వైసీపీ…
జగన్ పాలనలో కడప ఉక్కు పరిశ్రమను ఒక్క శాతం కూడా అభవృద్ధి చెందలేదని అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పురోగతి సాధించేందుకు తన వంతు కృషి చేస్తామని ఎంపీ రమేష్ వ్యాఖ్యానించారు. గడిచిన ఐదేళ్లు జగన్ సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారు.. పురపాలికల్లో ఎలాంటి అభివృద్ధి లేదని, సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో…
వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్ లు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఒకరు కోడి గుడ్ల మీద ఈకలు పీకుతాడన్నారు. మచిలీపట్నం లో అత్యధిక మెజారిటీ తో నిన్ను, నీ కుమారుడిని ఓడించారని, ప్రజలు ఛీ కొట్టిన వీళ్లు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారన్నారు బుద్దా వెంకన్న. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా చంద్రబాబు మారిస్తే… జగన్ అప్పుల…