ఇండియా-జింబాబ్వే మధ్య ఈరోజు ఐదో టీ 20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్కు దిగనుంది. ఇప్పటికే భారత్ సిరీస్ కైవసం చేసుకోగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 4-1 తేడాతో ముగించాలని టీమిండియా చూస్తోంది.
ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. షిండే ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు ఏక్నాథ్ షిండే ఘనంగా స్వాగతం పలికారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణలతో కలిసి రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు.. 'ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరేం చేశారు.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్ళల్ల కట్టే పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. వీళ్ళ పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా…
ఆంధ్రప్రదేశ్లో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగల పూడి అనిత పేర్కొన్నారు. యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ను హోం మంత్రి అనిత పరామర్శించారు. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే.
విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాధుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడుని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో ఏడు నెలల పసికందు పై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో ఆసుపత్రి కి బాడంగి సిహెచ్సీకి తీసుకు వచ్చారు తల్లిదండ్రులు. ప్రాధమిక…
పోలవరం 50 ఏళ్లలో పూర్తి కాదని మేము రాజశేఖర్ రెడ్డికి చెప్పామని సీపీఎం పొలిటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. రాజకీయాల్లో ఎవరున్న దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని బీవీ రాఘవులు. ప్రాజెక్టులో మనుష్యులకు మొదటి ప్రాధాన్యత, నీటికీ రెండో ప్రాధాన్యత, ప్రాజెక్టు మూడో ప్రాధాన్యత వుండాలన్నారు బీవీ రాఘవులు. గిరిజనులను మనుష్యులుగా చూడడం లేదని, పట్టిసీమ కాలువలకు పోయిన భూములకు భూమికి భూమి ఇస్తూ 38లక్షలు ఇచ్చిన వాళ్ళు గిరిజనులకు ముష్టి వేస్తున్నారన్నారు బీవీ రాఘవులు.…
దావత్లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి.. తెలంగాణలో ఏ ఫంక్షన్కైనా దావత్ జరగాల్సిందే. తెలంగాణలో పండగ అయినా, ఫంక్షన్ల అయినా, దావత్ లు ఇలా సందర్భం ఏదైనా సరే మేకలు, గొర్రెల తలలు తెగాల్సిందే. మటన్ ముక్క లేనిది దావత్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్ తో మందు ఉంటే ఆ సందడే వేరబ్బా.. మటన్ ముక్క.. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు. దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. కొటిపిలో రూ.4 కోట్ల విలువతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి బాలకృష్ణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందన్నారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయని, వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారన్నారు బాలకృష్ణ. ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో…
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు జరుగుతోంది. సభా నిర్వహణ విషయంలో కీలకాంశాలను యమమల రామకృష్ణుడు ప్రస్తావించారు. పూర్తి స్థాయి బడ్జెట్, ఓటాన్ అకౌంట్, ఆర్డినెన్స్ జారీ వంటి వాటిల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యనమల రామకృష్ణుడు సలహాలు ఇచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మాట్లాడుతూ.. ఈ నెలాఖరుతో గత ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ గడువు ముగియనుంది. గడువు ముగిసేలోగా బడ్దెట్ లేదా ఓటాన్ అకౌంట్ లేదా ఓటాన్ అకౌంట్…