గుంటూరు జిల్లాలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ దాస్ మాట్లాడుతూ.. పాండవులు నడయాడిన అమరావతి ప్రాంతంలో నవయుగ ధర్మరాజుగా చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం తలపెట్టారన్నారు. భవిష్యత్తు తరాలకోసం ఓ విజన్ తో తలపెట్టిన అమరావతి నిర్మాణానికి వెంకటేశ్వరస్వామి, దుర్గమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా అని ఆయన తెలిపారు. ధర్మరాజు అడుగుజాడల్లోనే…
గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసం అనేది ఉండదని, మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ ఇక చిరునామాగా ఉంటుందన్నారు. మంచి చేసే వారంతా ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందుకు రావాలన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై…
నేడు ముంబైకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొననున్నారు. అంతకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నిశ్చితార్థాల అనంతరం ప్రజలతో మమేకమై వారి అభ్యర్థనలను స్వీకరించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయానికి సీఎం…
ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్‌పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్‌పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్‌లో జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.…
నేడు, రేపు తిరుమలలో డీజీపీ తిరుమలరావు పర్యటన. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోనున్న డీజీపీ. రేపు మధ్యాహ్నం రాయలసీమ ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశం. నేడు అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా ఆశీర్వాద్ వేడుక. నేడు ముంబైకు సీఎం చంద్రబాబు. ఇవాళ సాయంత్రం 4గంటలకు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ముకుష్ అంబానీ ఇంట్లో జరిగే శుభకార్యంలో పాల్గొనున్న చంద్రబాబు. ఇవాళ రాత్రి ముంబైలో సీఎం చంద్రబాబు బస. నేడు 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ…
ఉత్తరప్రదేశ్‌లోని పిపారియా గురు గోవింద్ రాయ్ గ్రామంలో ఓ తోటమాలి దారుణ ఘటనకు పాల్పడ్డాడు. మామిడికాయలు కోయడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులపై బరితెగించాడు. తోటమాలి పిల్లలను తాడుతో చెట్టుకు కట్టేసి కొట్టాడు. ఈ వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు మేలుకుని.. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం తోటమాలిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
కురియన్ కమిటీతో సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన ఒక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం కేసీఆర్‌ను జైలుకు పంపడమేనని ఆయన అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సమాధి అయ్యిందన్నారు.
ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.