Viral News: చేపలు పొరపాటున నీటి నుండి బయటకు వస్తే చనిపోతాయని మనకు తెలిసిన విషయమే. అయితే చేపలు నేలపై నడుస్తాయని కొందరు అంటున్నారు. నీటిలో మాత్రమే జీవించే చేపలు భూమి మీద నడుస్తాయా? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అలాంటి చేపలు చూడాలంటే మహబూబ్ నగర్ వెళ్లాల్సిందే. ఇక్కడ చేపలు నడవడం కాదు ఏకంగా చెట్లే ఎక్కేస్తున్నాయి. ఈ చేపలు చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
Read also: Loose Motions: విరోచనాలు కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి..
మహబూబ్ నగర్ జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో రోడ్డుపై రెండు వింత చేపలు కనిపించాయి. పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వెళ్లే దారిలో ఈ చేపలను స్థానికులు చూశారు. అయితే రోడ్డుపై పాములా పాకుతున్న ఈ చేపలను చూసేందుకు స్థానిక ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన చేపలను చూసి జనం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ చేపల గురించి మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్పకు సమాచారం అందించారు. ఈ చేపలను పరిశీలించిన అనంతరం.. ఇవి సాధారణంగా నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తాయని తెలిపారు. ఈ చేపను గురక చేప (ఎక్కేచేప) అని కూడా అంటారు. వారి శాస్త్రీయ నామం అనబాస్ టెస్యూనియస్. ఈ చేపలు దాదాపు 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయని చెప్పారు.
Read also: Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఇది దాని తలకు ఇరువైపులా ఉన్న గిల్ కుహరంపై ప్రత్యేకమైన రంపపు వంటి దంతాలను ఉపయోగించి నేలపై పాకుతూ వెళతాయని తెలిపారు. ఇదొక్కటే కాదు ఈ చేప గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా వుందని.. ఈ చేపలు నేలపైనే కాదు, చెట్లను కూడా సులభంగా ఎక్కుతాయని తెలిపారు. ఏపీ ప్రాంతంలోని మత్స్యకారులు తాము పండించే చెరువుల్లో ఈ చేపలను ప్రత్యేకంగా ఆహార చేపలుగా పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. వర్షాకాలం ప్రారంభంలోనే చాలా చెరువులు, కుంటల్లో ప్రెజర్ ఏరియా క్రియేట్ ఏర్పడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఉభయచర స్వభావం కలిగిన చేపలు బలమైన ఈదురుగాలులతో గాలితో ఎగురుతాయి. భూమి మీదా, నీటి మీదా బతికే శక్తి వాటికి ఉంది. వర్షం, బలమైన గాలి వీచినప్పుడు గాలికి ఎగిరి మళ్లీ వర్షంతో కిందపడిపోతాయని చెబుతున్నారు.
Road Accident: ఆటో కోసం వేచిఉన్నవారిపైకి దూసుకెళ్లిన లారి.. తల్లీబిడ్డ మృతి.. ఇద్దరికి సీరియస్