ఏపీలో జీపీఎస్ జీవో, గెజిట్ వెనక్కి తీసుకోవడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. గత ప్రభుత్వం వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేసి జీపీఎస్ తెచ్చిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి కాలేజియేట్, టెక్నికల్, ఇంటర్మీడియట్ విద్యా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు/ పాలిటెక్నిక్‌లు/లో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగులకు బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GORt. నం. 118) తెలిపింది. ప్రతి కొత్త జిల్లాలు/జోన్/మల్టీ జోన్ కోసం ఆన్లైన్ వెబ్…
ఈ డిజిటల్ యుగంలో సాధ్యం కానిది ఏదీ ఉండదన్న విషయం కొన్ని పరిణామాల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. పెళ్లికొడుకు తండ్రి.. పెళ్లి కుమార్తె తల్లి ఇద్దరూ మనసు పడి పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే జంటగా పరారైన ఉదంతం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలోని దుండ్వారా ప్రాంతంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర వద్ద వికలాంగుడు అయినా మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేటాడి వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.
మీరు గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది.
ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మార్గదర్శకాల ప్రకారం పంజాబ్‌ను సురక్షిత రాష్ట్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రచారంలో స్టేట్ స్పెషల్ ఆపరేషన్ సెల్ (SSOC) అమృత్సర్ అంతర్-రాష్ట్ర ఆయుధాల అక్రమ రవాణా మాడ్యూల్‌ను బహిర్గతం చేసింది. ఈ ఆపరేషన్‌లో విదేశీ మూలం ఉన్న ఉగ్రవాది లఖ్బీర్ అలియాస్ లాండాకు చెందిన ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఆరు అధునాతన .32 బోర్ పిస్టల్స్‌తో పాటు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే…
తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
రుణమాఫీ 2018లో అవలంబించిన విధానాలే 2024 లో కూడా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అప్పుడు 2018 రుణ మాఫీ క్రింద 20 వేల కోట్లు ప్రకటించి , 2023 ఎన్నికల సంవత్సరలో 13 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులో 1400 కోట్లు వెనక్కి వచ్చిన కూడా కనీస స్పందన లేని ప్రబుద్ధులు ఈ రోజు మైకుల ముందుకి వచ్చి మాట్లాడటం విడ్డురంగా ఉందని మంత్రి తుమ్మల అన్నారు.…
ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట అని ఆయన విమర్శించారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి…