Osmania Hospital : ఉస్మానియాలో విజయవంతంగా కాలేయ మార్పిడి చికిత్స
- తల్లి కాలేయాన్ని కుమారునికి అమర్చిన వైద్యులు
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు
- కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఉస్మానియా ఆస్పత్రి ని తీర్చిదిద్దుతున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతున్నాయి. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఎనిమిదిమంది చిన్నారులతో పాటు 30 మందికి కాలేయ మార్పిడి చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా మరో చిన్నారికి కాలేయ మార్పిడి చికిత్స విజయవంతమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండవనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చోహన్ ఆదిత్య (3 సంవత్సరాలు) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. చోహన్ ఆదిత్యను పరిశీలించిన ఉస్మానియా వైద్యులు మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, కాలేయ మార్పిడి బృందం ఈ నెల మూడో తేదీన ఆదిత్యకు ఉస్మానియా ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
Also Read
చోహన్ ఆదిత్య మాతృమూర్తి అమల కాలేయాన్ని తన కుమారునికి దానం చేయడంతో కొంత భాగాన్ని తీసుకొని బాలునికి అమర్చారు. ప్రస్తుతం తల్లీకుమారుడు క్షేమంగా ఉన్నారు. వారిని మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల బృందాన్ని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఉస్మానియా ఆసుపత్రికి కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో వైద్య సేవలను అందిస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!