వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను జనసేనలోకి వెళ్తున్నానంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని బాలినేని స్పష్టం చేశారు.
పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే…
సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా…
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. రుణమాఫీ మార్గదర్శకాల పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కండిషన్ లేకుండా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, మరి ఈరోజు ఇన్ని కండిషన్స్ ఎందుకు.? అని ఆయన అన్నారు. రీ షెడ్యూల్ అయిన రుణాలకు మాత్రమే రుణమాఫీ ఇస్తామని అంటున్నారని, చాలా బ్యాంకులు లోన్ రికవరీ అయ్యి మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు…
హిమాలయ దేశంలో రాజకీయ సుస్థిరతను కల్పించే భయంకరమైన సవాలును ఎదుర్కొంటున్న కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్‌లోని అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారం ఆయనను ప్రధానమంత్రిగా నియమించారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే ప్రతి పేదవాడికి 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు…
మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారం వైసీపీదే..! మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్ల తోకలు కత్తిరించడం ఖాయమని హెచ్చరించారు.. ఇదేనే ప్రభుత్వం పనితీరు..? అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో నెలరోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. అధికార పార్టీ పతనం స్టార్ట్ అయ్యిందన్నారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురదజల్లేడం ఒక ప్రణాళిక…
రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
నిన్న తెలంగాణ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం పేరిట కల్లు గీత కార్మికులకు కిట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌడన్నల పట్ల సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గంటల తరబడి గౌడన్నలను చెట్ల మీద ఉంచడం సరికాదన్నారు. Gauri Krishna:…