Top Headlines @5PM : టాప్ న్యూస్
- అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్ కల్యాణ్‌పై పేర్నినాని ఫైర్..
- కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
- తిరుమలలో వరుస అపచారాలు.. మొన్న నమాజ్.. నేడు మద్యం తాగి..
- ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్.. అసలు దెయ్యం అతనే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాశ్మీర్‌లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాయాది దేశం సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాయాది సైనిక చర్యలకు జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో పూంఛ్ ప్రాంతంలో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ఒక పాఠశాలకు రాహుల్‌గాంధీ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌ను సందర్శించారు. ఇక ఆపరేషన్ సిందూర్ తర్వాత మరొకసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం విశేషం.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్.. అసలు దెయ్యం అతనే అంటూ..
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఏ హోదాలో ఉన్నా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా సూచనలు చేయొచ్చు.. లేఖ రాయొచ్చని తెలిపారు. అన్ని పార్టీల్లోను కోవర్టులుంటారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులుంటే ఉండొచ్చని కేటీఆర్ వెల్లడించారు.
భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా.. కేరళ, ముంబై, ఢిల్లీలో పెరిగిన కేసులు
భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయాలని.. అలాగే ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈనెలలోనే కేసులు పెరిగాయి. చిన్నపాటి కేసులే అయినా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు.
దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారు
ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత ఎపిసోడ్ ను డైవర్ట్ చేయడానికి కేటీఆర్, సీఎం రేవంత్ పై ఆరోపణలు చేశాడని, కేటీఆర్ ముందు ఇంట్లో రగులు నాకు ఇప్పటిని సరిపెట్టుకోవాలన్నారు మహేష్ గౌడ్. పది సంవత్సరాల టిఆర్ఎస్ తప్పిదాలను కవిత తప్పులను ఎత్తి చూపిందని, టీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తిరుమలలో వరుస అపచారాలు.. మొన్న నమాజ్.. నేడు మద్యం తాగి..
తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస వైఫల్యాలతో టీటీడీ నిఘా విభాగం సతమతం అవుతోంది. డ్రోన్ కలకలం నుంచి, హజ్రత్ డ్రెస్, క్యాప్‌తో తిరుమలకు ముస్లిం వ్యక్తి అలిపిరి టోల్ గేట్‌లో ప్రవేశించే వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మద్యం తాగడం, ఎగ్ బిర్యానీ తినడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండ్రోజుల కిందట తిరుమలలోను కళ్యాణవేదిక వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ముస్లిం మతస్తుడు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భక్తుల్లో ఒక్కసారిగా అసహనం వ్యక్తమైంది. నమాజ్ చేసిన వ్యక్తితో పాటు, వీడియో తీసిన వ్యక్తిని సైతం కేసు నమోదు చేశారు.
మంత్రి కొండా సురేఖతో మంత్రి సీతక్క భేటీ.. ఎందుకంటే.?
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అటవీ శాఖ నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. ఈ సమన్వయ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీశాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఐటిడిఎ అధికారులు హాజరయ్యారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకువస్తున్నారని, ప్రజల తరఫున ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.
కడపలో జరిగేది మహానాడా.. దగానాడా..? పేర్ని నాని సంచలన కామెంట్స్
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు. జిల్లా జిల్లాకు జరిగిన టీడీపీ కార్యకర్తల ఆక్రోశనాడులు అందరూ చూశారని.. ఓ జిల్లాలో మాజీ సీనియర్ మంత్రి బాధ అంతా ఇంతా కాదన్నారు.. ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.. ఒక్కచోట కూడా రాష్ట్ర ప్రజలకు తాము ఈ ఏడాదిలో ఈ మేలు చేశాము అని చెప్పిన దాఖలాలు లేవని ఆరోపించారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్.. అందరికీ బాస్ చెప్పుకునే మోడీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.. ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలని సిగ్గుపడుతున్నారని విమర్శించారు..
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కేసు..
వివాదాస్పద ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో నిలిచారు. ముఖ్యంగా, ఈమె బీజేపీ వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి తన వీడియోలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నేహాసింగ్‌పై మళ్లీ కేసు నమోదైంది. సామాజిక సంస్థ సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సౌరభ్ మౌర్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. నేహా సింగ్ తన వీడియోలో ‘‘పిరికి వాడు, జనరల్ డయ్యర్’’ వంటి పదాలను ఉపయోగించి ప్రధాని మోడీని ప్రస్తావించారు. ఆమె వీడియో పాకిస్తాన్ మీడియా ఛానెల్‌లో కూడా ప్రసారం చేయబడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానిని అవమానించడమే కాకుండా, దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని డాక్టర్ మౌర్య పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) లోని మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జాతీయ సమైక్యతను హాని కలిగించడంతో పాటు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందనే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది.
కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, హరీష్ కలిసి ఆమెను పార్టీ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేడో, రేపో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్ కల్యాణ్‌పై పేర్నినాని ఫైర్..
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట.. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం సరికాదన్నారు. సినిమా వాళ్లకు గొడవలు జరుగుతున్న సమయంలో జైళ్లో వేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సినిమా ఫీల్డ్ ను ఉద్ధరిస్తారని ఆ శాఖ తీసుకున్న మంత్రి థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని చెప్పారు.. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా? అని నిలదీశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..