‘పుతిన్ పిచ్చోడు’.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడిపై ట్రంప్ ఆగ్రహం
గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల మెతక వైఖరి ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసిన తర్వాత కఠిన వైఖరి తీసుకున్నారు. న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ, “నేను పుతిన్ వ్యవహారం సరిగా లేదు. ఆయన పూర్తిగా పిచ్చివాడైపోయాడు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు” అని అన్నారు. “నాకు పుతిన్ చాలా కాలంగా తెలుసు, మా మధ్య మంచి సంబంధం ఉంది. కానీ ఇప్పుడు ఆయన బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. ఎటువంటి కారణం లేకుండా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు మరియు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. నగరాలపై దాడి చేస్తున్నాడు, ప్రజలను చంపుతున్నాడు. నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. ఈ వ్యక్తికి ఏమైందో నాకు తెలియదు. నాకు ఇదంతా అస్సలు నచ్చదు.” అని తెలిపాడు.
భారత్ తో ఉద్రిక్తతల మధ్య.. పాకిస్తాన్ ప్రధాని టర్కీ అధ్యక్షుడితో తొలి సమావేశం
ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్స్ వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం క్లోజ్డ్ రూమ్ లో జరిగింది. ఈ సమావేశానికి తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, రక్షణ మంత్రి యాసర్ గులెర్ కూడా హాజరైనట్లు ఎర్డోగన్ కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ, ఇరాన్, అజర్‌బైజాన్, తజికిస్తాన్ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు. ఇది మే 25 నుంచి మే 30, 2025 వరకు కొనసాగనుంది.
ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు కోసం చూడరని, దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హిమాలయ పర్వతాలు ఎలా తలవంచవో ప్రధాని సైతం ఎక్కడా తలవంచరన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా మన దేశ శక్తిసామర్థ్యాలను చాటిన ఘనత ప్రధానిదే అని స్పష్టం చేశారు. ‘పీఎం-జన్ మన్’ ద్వారా మారుమూల గిరిజన ఆవాసాలకు రోడ్లు నిర్మిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రూ.555.61 కోట్లతో రోడ్లు చేపట్టాము అని డిప్యూటీ సీఎం చెప్పారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసే అవకాశముంది. అంతేకాకుండా, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మట్టిశిల్పకారులు, ఓపెన్‌లో పనిచేసే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది.
ఈ ఏడాది మాది కాదు.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 110 పరుగుల భారీ విజయం సాధించి సీజన్ ను ఘనంగా ముగించారు. అయితే, ప్లేఆఫ్ బరిలో నిలబడలేకపోవడంపై జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశారు. మా వద్ద ఆడగలిగే సత్తా ఉంది.. కానీ, కొన్ని సందర్భాల్లో ఆడలేకపోయాం. ఇది మా ఏడాది కాదేమో అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశారు. ఇంకా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. సీజన్ చివరలో గొప్పగా ముగించాం. చివరి కొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడాం. కానీ కొన్ని భాగాల్లో మాత్రం చాలా ఘోరంగా ఆడామని అనిపించింది. మా జట్టు ఫైనల్‌కు అర్హత ఉన్న జట్లలో ఒకటి, కానీ ఈసారి ఆ పనిచేయలేదు అంటూ కామెంట్స్ చేసాడు కమిన్స్. అలాగే ఈ తరహా పిచ్‌లపై మాకున్న సత్తాతో ఆడగలిగాం. కానీ కొన్ని మ్యాచ్‌లలో 170 పరుగులు చేయాల్సినప్పుడు మేము ఆడలేకపోయాము. జట్టులోని చాలా మందికి అవకాశాలు ఇచ్చాం. గాయాల వల్ల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మొత్తంగా 20 మంది ఆటగాళ్లను ఉపయోగించాం అని కమిన్స్ వివరించారు.
ఈ ఏడాది మాది కాదు.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 110 పరుగుల భారీ విజయం సాధించి సీజన్ ను ఘనంగా ముగించారు. అయితే, ప్లేఆఫ్ బరిలో నిలబడలేకపోవడంపై జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశారు. మా వద్ద ఆడగలిగే సత్తా ఉంది.. కానీ, కొన్ని సందర్భాల్లో ఆడలేకపోయాం. ఇది మా ఏడాది కాదేమో అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశారు. ఇంకా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. సీజన్ చివరలో గొప్పగా ముగించాం. చివరి కొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడాం. కానీ కొన్ని భాగాల్లో మాత్రం చాలా ఘోరంగా ఆడామని అనిపించింది. మా జట్టు ఫైనల్‌కు అర్హత ఉన్న జట్లలో ఒకటి, కానీ ఈసారి ఆ పనిచేయలేదు అంటూ కామెంట్స్ చేసాడు కమిన్స్. అలాగే ఈ తరహా పిచ్‌లపై మాకున్న సత్తాతో ఆడగలిగాం. కానీ కొన్ని మ్యాచ్‌లలో 170 పరుగులు చేయాల్సినప్పుడు మేము ఆడలేకపోయాము. జట్టులోని చాలా మందికి అవకాశాలు ఇచ్చాం. గాయాల వల్ల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మొత్తంగా 20 మంది ఆటగాళ్లను ఉపయోగించాం అని కమిన్స్ వివరించారు.
నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన!
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చెన్నైలో పర్యటించనున్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై జరగనున్న సెమినార్‌లో ముఖ్యఅతిథిగా అయన పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాలులో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు జరగనుంది. తెలంగాణ మాజీ గవర్నర్, ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్ తమిళసై సౌందర రాజన్ నేతృత్వంలో ఈ సెమినార్ ఏర్పాటైంది.
18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
కర్ణాటక అసెంబ్లీలో రెండు నెలల క్రితం అనుచిత ప్రవర్తన కారణంగా ఆరు నెలల పాటు సస్పెండ్ చేయబడ్డ 18 బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని స్పీకర్ ఖాదర్ ఆదివారం అధికారికంగా ఎత్తివేశారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత ఆర్. అశోక, న్యాయ శాఖ మంత్రి హెచ్.కే. పాటిల్‌లతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21న బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్పీకర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వారిపై “అనుచిత ప్రవర్తన” ఆరోపణలతో సస్పెన్షన్ విధించబడింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. కొంతమంది కాగితాలు విసిరి హల్చల్ సృష్టించడంతో, వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించాల్సి వచ్చింది.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు క్లారిటీ..?
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై నేడు తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అదే విధంగా, ఇవాళ ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీతో సమావేశమై విస్తరణపై తుదిరూపురేఖలు ఖరారు చేసే అవకాశముంది. విస్తరణలో భాగంగా ఐదుగురు కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశంపై పార్టీలో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండు నెలల క్రితమే విస్తరణపై కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లతో రాష్ట్ర నేతలు పలు విడతలుగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. పలువురు నాయకుల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి పదవికి తమకే అవకాశం ఉందంటూ కొందరు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, శ్రీహరి ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. నదులుగా మారిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు
నైరుతి రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. కేరళ తర్వాత, నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే మహారాష్ట్రకు చేరుకున్నాయి. ఆదివారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా, పూణే-సోలాపూర్ హైవే జలమయం అయింది. రోడ్లు నదులను తలపించాయి. రోడ్లపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ వర్షాలు ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. రాబోయే కొద్ది గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.