పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!
పాకిస్తాన్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత చాలా సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు వర్షాకాలం ముందే బంపర్ ఆఫర్
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మంచి వార్తను అందిస్తోంది. రానున్న వర్షాకాలంలో ప్రజలు తిండికి, రేషన్ సరుకులకు ఇబ్బందులు పడకుండేందుకు ముందుగానే పెద్దసెరిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. వర్షాకాలంలో సాధారణంగా భారీ వర్షాలు, వరదలు, రవాణా అంతరాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జూన్, జులై, ఆగస్ట్ నెలలకు అవసరమయ్యే రేషన్ సరుకులను ముందుగానే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేసిన ప్రణాళిక ప్రకారం, ఈ మూడు నెలల రేషన్ సరుకుల పంపిణీ మే నెల చివరిలో లేదా జూన్ నెల మొదటి వారం నుంచే ప్రారంభం కానుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు రేషన్ కోసం వర్షాల మధ్య తిరగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను పౌర సరఫరా శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా దాదాపు 2.81 కోట్ల మందికి సబ్సిడీ రేటుతో రేషన్ సరుకులు అందుతున్నాయి. కాగా, 2024 జనవరి 26 తర్వాత ప్రభుత్వం కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులను జారీ చేయడంతో లబ్ధిదారుల సంఖ్య 3.11 కోట్లకు చేరింది.
కాల్ సెంటర్ ముగుసుగులో భారీగా ఆర్థికమోసాలు.. అమెజాన్ కస్టమర్లే లక్ష్యంగా..?!
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో సైబర్ నేరాల కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారీ ముఠా పై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. భోగాపురంలోని కొన్ని అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా గత రెండేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వెల్లడైంది. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా ప్రధానంగా అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కోట్లాది రూపాయల మోసాలకు తెగబడింది. ఈ ముఠా తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాల నుండి యువతీ యువకులను తీసుకువచ్చి వారిని ఈ కార్యకలాపాల్లో భాగస్వాములను చేసింది. వారిని ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఫోన్ ద్వారా విదేశీ కస్టమర్లతో సంభాషణ చేయిస్తూ అకర్మలకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా పోలీసులు ఈ నెలలో జరిగిన దాడిలో 100 మందికిపైగా యువతను గుర్తించి, వారిలో 30 మందిని అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదం ప్రపంచానికి అతి పెద్ద సమస్య.. పాక్పై శశిథరూర్ ఫైర్!
ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వంలోని బృందం అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలోనే న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్‌ను టీమ్ సందర్శించింది. ఈ సందర్భంగా ఎంపీ శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై మనం ఐక్యంగా పోరాడాలని కోరారు. అయితే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. ఈ దాడితో భారత్‌లో మతపరమైన అల్లర్లు సృష్టించాలని వారు ప్రయత్నించారు.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడిందన్నారు. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ఇది. దీన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఇండియా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించింది.. నేను ప్రభుత్వంలో కాకుండా.. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను.. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత బలగాలు తెలివితో దెబ్బ తీశాయని శశిథరూర్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం.. తెలుగు రాష్ట్రాల ప్రజలూ జర భద్రం..!
కొనసాగుతున్న ఆశాజనకమైన పరిస్థితుల మధ్య, కరోనా వైరస్ మళ్లీ తన ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, కొత్త వేరియంట్లు వెలుగు見る్చడం అధికారులు, ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది. “ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం” నిపుణుల ప్రకారం, రెండు కొత్త కరోనా వేరియంట్లు – NB.1.8.1 , LF.7 – ఇటీవల గుర్తించబడ్డాయి. ఇవి ప్రస్తుతం ప్రధానంగా నగర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. జేఎన్.1 వేరియంట్ ప్రభావంతో కూడిన కేసులు ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి.
ఒక కూతురి తండ్రిగా నేను కోరుకునేది అదే..
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తాజాగా వివాదంలో చిక్కుకున్నాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు ఈ పోటీల చుట్టూ కలకలం రేపుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మిల్లా, నిర్వాహకులు తమపై అసభ్యమైన ఒత్తిడులు తీసుకువచ్చారని, స్పాన్సర్లను ఆకట్టుకోవాలనే ముట్టడి ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఇది వేశ్యలాగానే ప్రవర్తించినట్లుగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోటీని మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలపై తాను చింతిస్తున్నానని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ప్రెస్ నోట్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇటు టాలీవుడ్ అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ పవన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం అనుసరించబోయే ధోరణి గురించి సవివరంగా చెప్పడం నిర్మాతల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది అవుతున్నా.. ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ప్రస్తావించిన విషయాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.
మిస్ వరల్డ్ పేరుతో భారతదేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో సంచలన ఆరోపణలు వెలువడటంతో రాష్ట్ర రాజకీయ వర్గాలు గాఢ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంలో తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలలో, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం , భారతదేశ ప్రతిష్టను దిగజార్చిందని మండిపడ్డారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర ప్రతిష్టపై సవాలు విసురుతున్నాయని, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా ఆహ్వానించారు.
ఉగ్రవాదానికి నేడు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది..
పహల్గామ్ ఉగ్రవాద దాడికి కౌంటర్‌గా భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు (మే 25) మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదానికి ఈరోజు దేశం మొత్తం వ్యతిరేకంగా నిలిచింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం ప్రతి భారతీయుడిని గర్వించేలా చేసిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..
దేశ రాజధాని ఢిల్లీని భారీలు వణికిస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షంతో.. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అండర్‌పాస్‌లు నీటితో నిండి పోవడంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మరోవైపు, ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలోని ఎయిర్‌పోర్టులో సుమారు 200 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.