అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపై తప్పుడు కూతలు మానుకోవాలన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంగ్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని,…
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం 8 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,91,003 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది.
పిఠాపురం మహారాజా వారసులకు చెందిన ఆస్తుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే విచారణ చేయాలని కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇంటికి వెళ్లి ఆర్డీవో కిషోర్ విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని.. ఈ ఆస్తికి సంబంధించి వివాదం కోర్టు పరిధిలో ఉందని.. ప్రస్తుతం ఉన్న జడ్జిమెంట్ ప్రకారం ఈ ప్రాపర్టీ చంద్రలేఖ కుటుంబానికి చెందినదని.. శాఖా పరంగా విచారణ…
పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత ఆటగాడు పతకం సాధించడంలో దగ్గర్లో ఉన్నారు. 50 మీటర్ రైఫిల్ 3 పాజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్న్‌లు) దాఖలు చేయడానికి జులై 31తో చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది.
అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్ లో విధివిధానాలు ఖరార చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తామని ఆయన తెలిపారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెల్ల రేషన కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై…
ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని…
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు.