ఈ రోజుల్లో మార్కెట్లో చాలా ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వేల రూపాయలు ఖర్చు చేసిన క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కి కూడా మీ చర్మం మీకు కావలసినంత మెరుస్తూ ఉండదు. కానీ అదే మార్కెట్ నుంచి కేవరం రూ.20 నుంచి 25 రూపాయలకు మంచి బ్యూటీ ప్రొడక్ట్ కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు హీట్ హీట్ గా కొనసాగుతున్నాయి. ఈరోజు లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా.. ఏఐఎంఐఎం (AIMIM) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం, జార్ఖండ్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం సహజమే.. కానీ తరచూ జరిగే రైలు ప్రమాదాలను సాధారణ సంఘటనగా పేర్కొనలేమని ఆయన అన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ తప్పిదం ఉందని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించడంలో…
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరమని, రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారన్నారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని, సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపాదికన రైతులను…
నిపా వైరస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభలో వెల్లడించారు. నిపా, కోవిడ్-19 వంటి అంటువ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయని ఆయన అన్నారు. జంతువులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ వ్యాధులు మానవులలో వ్యాపించాయని చెప్పారు. అటువంటి ఉద్భవిస్తున్న వ్యాధులను ఎదుర్కోవటానికి.. మానవ, జంతువు.. పర్యావరణ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు.
రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు…
మహిళలు మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కానీ వారి ఆరోగ్యం పట్ల చాలా అజాగ్రత్తగా ఉంటారు. ఈ అజాగ్రత్త వల్ల చాలా మంది మహిళలు చిన్నవయసులోనే ఎముకలకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు. పురుషుల కంటే మహిళల్లో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మోనోపాజ్ తర్వాత, స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు తగ్గడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా ఎముకలు బలహీనపడతాయి.
వాంతులు, వికారం , విరేచనాలు వంటి లక్షణాలతో వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా పిలువబడే కడుపు ఫ్లూకి కారణమయ్యే సాధారణ ఇంకా అంటువ్యాధి అయిన నోరోవైరస్ వ్యాప్తి చెందుతుందనే నివేదికలపై ప్రజలు, ముఖ్యంగా పాతబస్తీ వాసులు భయపడవద్దని హైదరాబాద్‌లోని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు కోరారు. నోరోవైరస్ , భయాందోళనలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దని, మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ప్రజలను కోరారు. “ఇప్పటివరకు పాత నగరంలో…
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు వివిధ దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని తన మిలియన్ల మంది సబ్‌స్కైబర్లకు చెప్పారు. తన బయోలాజికల్ పిల్లల గురించి పలు వివరాలను తన సుదీర్ఘ పోస్ట్‌లో వారితో పంచుకున్నారు.
ఈరోజు లక్షన్నర రుణ మాఫీ చేయడం శుభ పరిణామమని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తొందర్లోనే మిగతా వారికి కూడా రుణ మాఫీ చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కళ్ళాల వద్దే కొనాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దరిద్రంగా తయారైందని, ధరణి వల్ల భూముల్లో గందరగోళం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అందులో మార్పులు చేయాలంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాలని,…