Bandi Sanjay : నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్” (TREIRB) 2024 సంవత్సరంలో నిర్వహించిన వివిధ గురుకుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పరీక్షలకు వేల సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో భాగంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. తర్వాత జాబితా తయారుచేసి వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగ నియామకం ప్రక్రియ చేపట్టారు. అయితే డిసెన్డింగ్ ఆర్డర్ విధానంలో(డి- ఎల్ > జె- ఎల్ > పిజిటీ > టిజిటీ) జరిగితే వివిధ రకాల క్యాడర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద క్యాడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని మిగతా కేడర్ ఉద్యోగాలకు రీలిన్క్విష్మెంట్ (relinquishment) లెటర్ ఇవ్వడం వల్ల ఒక అభ్యర్థి అనేక ఉద్యోగాలకు ఎంపికైనా కూడా ఆ స్థానాలు ఖాళీగా ఉండకుండా తర్వాతి మెరిట్ అభ్యర్థులతో నింపడం వల్ల ఎలాంటి ఖాళీలు ఉండవు. దీనివల్ల విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధన కుంటు పడకుండా అధ్యాపకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. దీనివల్ల నాణ్యమైన విద్య విద్యార్థికి అందుతుంది. అదేవిధంగా మెరిట్ అభ్యర్థి నష్టపోకుండా తనకి ఉద్యోగ అవకాశము కూడా దక్కుతుంది.
అట్లా కాకుండా డిసెండింగ్ ఆర్డర్ విధానంలో వివిధ క్యాడర్ పోస్టులకు రిలింక్విష్మెన్ట్ తీసుకోకుండా, తర్వాతి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయకపోతే ఏర్పడే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి మరొక నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తర్వాత మెరిట్ లో ఉన్న అభ్యర్థులు మళ్లీ పోటీ పడడంలో అననుకూల పరిస్థితుల్లో నష్టం కలిగే అవకాశం కలదు. కావున ప్రభుత్వం గతంలో ఏరకంగానైతే డిసెండింగ్ ఆర్డర్ విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి రిలింక్విస్మెంట్ విధానంలో ఖాళీలు ఏర్పడకుండా మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇస్తూ నియామకం చేపట్టారో, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి, దాదాపు 3000 మంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని బండి సంజయ్ అన్నారు.
Also Read
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
- Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
తాజావార్తలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!