షెరటన్ హోటల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం పై ఢిల్లీ లో చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్‌ఎస్ డిపాజిట్ కోల్పోయింది. హరీష్ రావు, కేటీఆర్ నియోజక వర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. మేము ప్రచారం చేయకపోయినా 2018లో మాకు మూడు పార్లమెంట్ సీట్లు వచ్చాయి..మేము కనీసం ప్రచారం కూడా చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..