హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా మంది వాహనదారులు హెల్మెట్ ధరించట్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిబంధనల అమలు చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారని హైకోర్టు మండిపడింది.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. 14 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్థులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు. హోం శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు.
డుతూ పాడుతూ పాఠశాలకు వెళుతున్న ఓ విద్యార్థిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబలించింది. కడప నగరంలోని అగాడి వీధలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సెచ్‌లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. రియాక్టర్ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి.
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతం.. విశాఖ ఒకేలా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతానికి మా పార్టీది మూడు రాజధానుల విధానమేనని.. మూడు రాజధానులపై మా పార్టీ విధానం మార్చాలనుకుంటే మా నాయకుడితో చర్చించుకుంటామని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలోని తన ఇంటికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాగా.. ఆయన ఇంటిని ముట్టడించడానికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు.