ఇంజనీరింగ్ సేమ్ కాలేజీలో బ్రాంచ్ చేంజ్ కు(సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్) అవకాశం కల్పిస్తూ ఉత్వర్వు జారీ చేసింది. ఆగస్టు 21 నుండి TS EAPCET 2024 కోసం అంతర్గత స్లైడింగ్ రౌండ్‌ను ప్రారంభిస్తుంది. అభ్యర్థులు tgeapcet.nic.inలో అందుబాటులో ఉండే లింక్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీని ఉపయోగించుకోవచ్చు. అలాగే, TS EAPCET కౌన్సెలింగ్ చివరి రౌండ్లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆగస్టు 17, 2024లోపు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. TSCHE TS EAMCET 2024…
ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్‌కు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వివరించారు.
టూరిజాం అంటే కొన్ని పట్టణాలకే పరిమితమైందని, కాలక్రమేణా చారిత్రాత్మక కట్టడాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి సీతక్క. గుర్తింపు కు నోచుకోక ఇబ్బందులు పడుతున్నామని, పల్లెలో ఉన్న ఆరోగ్యం, ఆనందం, పర్యాటకం ఎక్కడ ఉండదన్నారు మంత్రి సీతక్క. పల్లెలను అభివృద్ధి పథం లో తీసుకురావాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. గోదావరి పర్యాటక ప్రాంతాలు ఇక్కడా ఉన్నాయి… ప్రకృతి సంపదను కాపాడుకుంటూ టూరిజాన్ని డెవెలప్ చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు.. భవిష్యత్ తరాలకు కలలను,కళా కాండలను కాపడికోవాలని…
వెలుగొండ ప్రాజెక్టు పటిష్టతపై మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలుగొండ హెడ్ రెగ్యులెటర్ పనుల్లో నాణ్యత లేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత సరిగా లేదని ఆయన విమర్శించారు.
ప్రజా భవన్లో బ్యాంకర్స్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లెక్కలు కాదు ఆత్మ ఉండాలి.. 18 వేల కోట్లు బ్యాంకులకు చేర్చాము, రైతులకు మాత్రం నేటి వరకు 7500 కోట్లు మాత్రమే చేరాయి, రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదన్నారు. గ్రామీణ ప్రాంతాలను వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాము. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్న ము. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తాం. రుణమాఫీ,…
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలలో వీవీ ప్యాట్లల్లో ఓట్లు సరిపోల్చాలని మాక్ పోలింగ్ వద్దని బాలినేని పిటిషన్ వేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి తరఫు న్యాయవాది ఇవాళ వాదనలు వినిపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వాగతం పలికారు.
భూవివాదాలను త్వరగా పరిష్కరించండి.. మంత్రి లోకేష్ ఆదేశాలు ప్రజా సమస్యల పరిష్కారం ఫోకస్ పెట్టారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.. ఇక, 28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని…
రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.