కష్టతరమైన వెన్నెముక శస్త్ర చికిత్సలకు అత్యాధునిక పరిష్కారాలను అందిస్తూ.. స్టార్ హాస్పిటల్స్ సగర్వంగా తన అధునాతన ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ నూతన సదుపాయం రోగులకు అధునాతన వెన్నెముక శస్త్రచికిత్సలను డే-కేర్ విధానాలుగా చేయగలుగుతుంది. దీని ద్వారా అధిక-రిస్క్ ఉన్నవారికి మరియు వృద్ధ రోగులకు ఉపయోగంగా కొన్ని రోజుల్లోనే కోలుకోవచ్చు.
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల వాగ్దానంలో ఈ పథకం అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అంశాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందించడం ప్రాధాన్యతను వివరించారు.…
ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఆఫ్రికాలోని 12 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. ఆసియాలో కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో.. థాయిలాండ్ ప్రభుత్వం మంకీపాక్స్ కొత్త వేరియంట్ యొక్క మొదటి కేసు తమ దేశంలో సంభవించినట్లు ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్టు 14న ఆఫ్రికా నుంచి థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అతన్ని పరీక్షించగా అతనికి Mpox, క్లాడ్ 1B అనే…
బడ్జెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం రూ. 25 వేలు ఉంటే.. 5G నెట్ వర్క్ కలిగి ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు చాలా సార్లు కస్టమర్లు వాటి పనితీరు.. కెమెరా క్లారిటీ కోసం ఏ ఫోన్‌ను కొంటే బాగుంటుందో తెలుసుకోరు. ఈ క్రమంలో.. ఇప్పుడున్న బెస్ట్ ఫోన్ల జాబితాను మీ ముందుంచాం. వీటిలో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏదైనా ఫోన్‌ని కొనుగోలు చేయండి.
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
గచ్చిబౌలిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ వ్యభిచార గృహంలో 17 మంది విదేశీ యువతులను పోలీసులు పట్టుకున్నారు. అంతర్జాతీయ యువతులతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఆర్గనైజ్డ్గా వ్యభిచారం చేయిస్తున్న గుట్టును గచ్చిబౌలి పోలీసులు, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు రట్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్‌లోని ఒక ఇండిపెండెంట్ హౌస్‌లో ఈ గలీజు దందాను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సదరు…
చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్‌కతాలోని ఆర్జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
గ్రూప్-II సర్వీసెస్ రిక్రూట్మెంట్ కోసం 2024 డిసెంబర్ 15 మరియు 16 మధ్య రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం తెలియజేసింది. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ డిసెంబర్ 15, 2024న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య నిర్వహించబడతాయి, పేపర్-II, హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు…
తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ భేటీ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎంను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక…